తీన్మార్ మల్లన్నపై మరో కేసు

తీన్మార్ మల్లన్నపై మరో కేసు

హైదరాబాద్ : తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ అనే యువకుడు తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశాడు. ఈడీ విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కించపరిచేలా స్టేట్మెంట్ మల్లన్న ఇచ్చాడని ఫిర్యాదులో శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని శ్రీకాంత్ ఫిర్యాదుతో మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీన్మార్ మల్లన్నతో పాటు బ్రహ్మి ట్రోల్స్ నిర్వాహకులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తీన్మార్ మల్లన్న  ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ కామెంట్స్ ను బ్రహ్మీ ట్రోల్స్ అనే యూట్యూబ్ చానెల్ లో వాడారని,  ఆ క్లిప్పింగ్ ఆధారంగా శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే SOT పోలీసులపై దాడి కేసులో మల్లన్నతో పాటు మరికొందరు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో న్యాయస్థానం వీరికి14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇప్పటికే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తీన్మాన్ మల్లన్నపై రెండు  కేసులు నమోదయ్యాయి.