ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. నిన్న తాండూరు సీఐని తిట్టారంటూ ఆడియో రికార్డింగ్ వచ్చిన తర్వాత... పాత వివాదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం రంజాన్ తోఫా పంపిణీ సందర్భంగా యాలాల ఎస్ఐ అరవింద్ కుమార్ ని దుర్భాషలాడారంటూ కేసు నమోదు అయ్యింది. యాలాలలో జరిగిన గొడవలో తన వర్గానికి చెందిన నేతలను పోలీసులు తీసుకెళ్తుండటంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ సందర్భంగా ఎస్ఐ అరవింద్ ను బూతులు తిట్టారు. దీనిపై ఎస్ ఐ తీవ్ర మనస్తాపం చెందారు. అరవింద్ ఫిర్యాదు మేరకు యాలాల పోలీస్ స్టేషన్ లో పట్నం మహేందర్ రెడ్డిపై ఐసీపీ 353, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని వార్తల కోసం
రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ నాదే
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరం!
