
- అధికారిక ప్రొగ్రామ్‌లో పొలిటికల్ కామెంట్లు చేశారంటూ కంప్లయింట్
హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల సంఘాని(ఈసీ)కి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ప్రగతి భవన్‌ను రాజకీయ కార్యక్రమాల కోసం వాడుతున్నారని ఇప్పటికే ఫిర్యాదు చేసిన కాంగ్రెస్.. అధికారిక కార్యక్రమంలో రాజకీయ కామెంట్లు చేశారంటూ శుక్రవారం మరోసారి కంప్లయింట్ చేసింది. గురువారం పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన సీఎం షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంట్రప్రెన్యూర్ షిప్ ఇన్నోవేషన్ స్కీమ్ సక్సెస్ మీట్‌లో ఆయన రాజకీయ కామెంట్లు చేశారని చెప్పింది.
ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ల సక్సెస్ మీట్ కొచ్చి.. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారంటూ మాట్లాడరని సీఈసీ రాజీవ్ కుమార్‌కు ఆ పార్టీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ లేఖ రాశారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అవుతుందని, మంత్రిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుకు కేటీఆర్ చేసిన కామెంట్ల వార్త కథనాన్ని జత చేశారు.