భూముల అమ్మకంతో సర్కార్ కు మరో రూ.120 కోట్ల ఆదాయం

భూముల అమ్మకంతో సర్కార్ కు మరో రూ.120 కోట్ల ఆదాయం

భూముల అమ్మకం ద్వారా కేసీఆర్ సర్కార్ కు మరో రూ.120 కోట్ల ఆదాయం వచ్చింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో 8 ప్లాట్స్ లో 4 ప్లాట్స్, మేడ్చల్ మల్కాజ్ గిరి లో 8 ప్లాట్స్ లో 1 ప్లాట్, సంగారెడ్డి జిల్లాలో 10 ప్లాట్స్ లో 4 ప్లాట్స్ వేలంలో అమ్ముడుపోయాయి. మూడు జిల్లాలోని మొత్తం 26 ప్లాట్స్ కు 9 ప్లాట్స్ మాత్రమే సెల్ అయ్యాయి. ఈ 9 ప్లాట్స్ అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120 కోట్ల ఆదాయం వచ్చింది.

26 ప్లాట్స్ కు తెలంగాణ సర్కార్ పెట్టిన అప్సెట్ ప్రైస్ రూ. 267 కోట్లు. రెండు సెషన్లలో వేలానికి 69 వేల 246 గజాలు పెడితే.. 24 వేల 140 గజాలు మాత్రమే అమ్ముడుపోయాయి. అయితే.. మూడు జిల్లాలోని మిగులు భూములకు మాత్రం ఆదరణ కరువైంది. ఈ సారి ప్రభుత్వాన్ని భూముల వేలం నిరాశ పర్చింది.

రెండు సెషన్లలో బిల్డర్లు, కొనుగోలుదారులు అంతగా ఆదరణ చూపలేదు. రంగారెడ్డి జిల్లాలో గజానికి రూ.50 వేలు నిర్ధారిస్తే.. అత్యధికంగా రూ.90 వేలకు కొనుగోలు చేశారు. మేడ్చల్  లో గజానికి రూ.25 వేలు నిర్ధారిస్తే.. రూ.26 వేలకు దక్కించుకున్నారు. ఇటు సంగారెడ్డిలో గజానికి రూ.40 వేలు నిర్ధారిస్తే అత్యధికంగా రూ.45 వేలు కోడ్ చేసి ప్రభుత్వ స్థలాన్ని  సొంతం చేసుకున్నారు. మూడు జిల్లాల్లోని మిగులు భూములకు రెండో సారి వేలం వేసినా బిడ్డర్లు కొనడానికి ముందుకు రాలేదు.