ధరణిలో మరో కొత్త ఆప్షన్

ధరణిలో మరో కొత్త ఆప్షన్
  • పంటభూములకు బదులు ఇండ్ల స్థలాలుగా పడితే మార్చుకునే చాన్స్

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ లో మరో కొత్త ఆప్షన్ అందుబాటు లోకి వచ్చింది. సాగులో ఉన్న పట్టా భూములను పొరపాటున ఇండ్లు, ఇండ్ల స్థలాలుగా చూపితే రికార్డుల్లో మార్పు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. ఇందుకోసం సదరు భూమి యజమాని ఓనర్ షిప్ కు సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలతో మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయగానే అప్లికేషన్ నంబర్ జనరేట్ కానుంది. ఆ తర్వాత బయోమెట్రిక్ నమోదు చేయించుకోవాలి.  ఈ అప్లికేషన్ కలెక్టర్ లాగిన్ లోకి వెళ్తుంది. తర్వాత కలెక్టర్ ఆ అప్లికేషన్ ను అప్రూవ్ చేయడమో, రిజెక్ట్ చేయడమో చేస్తారు. అప్లికేషన్ అప్రూవ్ అయితే ఇ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–పట్టాదారు పాస్ బుక్ జారీ కావడం, ప్రింట్ చేసిన పాస్ బుక్ పోస్టులో ఇంటికి వస్తుంది.