కరోనా సోకి ఎంసెట్ మిస్సయిన విద్యార్థులకు మరో అవకాశం

కరోనా సోకి ఎంసెట్ మిస్సయిన విద్యార్థులకు మరో అవకాశం

కరోనా సోకి  ఎంసెట్ మిస్సయిన  విద్యార్థులకు మరో అవకాశమిచ్చింది JNTUH. ఆగస్టు 17వ తేదీ  నుంచి సెప్టెంబర్ 14వ  తేదీలోపు  పాజిటివ్ వచ్చి  పరీక్ష రాయని విద్యార్థులు ఈసారి రాయొచ్చన్నారు  ఎంసెట్ కన్వీనర్  గోవర్ధన్. విద్యార్థులు  తప్పని సరిగా పాజిటివ్  రిపోర్టును ఈ నెల  5 వ తేదీ లోపు  తమకు పంపాలన్నారు. ఎంసెట్  వెబ్ సైట్ లో  కరోనా అండర్  టేకింగ్ ఫామ్ అందుబాటులో  ఉంటుందన్నారు కన్వీనర్.