కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

టీంఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. సొంత గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యంత వేగంగా 10 వేల పరుగులు సాధించిన భారత రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ రికార్డును మొదటగా సచిన్ చేరుకున్నాడు. మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అర్ధశతకం పూర్తి చేయడంతో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ రికార్డును సచిన్ 223 ఇన్నింగ్స్‌ల్లో చేరుకోగా.. కోహ్లీ 195 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. దాంతో సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ 10002 పరుగులు సాధించాడు.

ఈ రికార్డును చేరుకోవడానికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ 219 ఇన్నింగ్స్‌లు, శ్రీలంక ప్లేయర్లు మహేల జయవర్దనే 224 ఇన్నింగ్స్‌లు, కుమార సంగక్కర 229 ఇన్నింగ్స్‌లు, జాక్వెస్‌ కలీస్‌ 236 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. అయితే తమ సొంతగడ్డపై 10వేల పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి కోహ్లీ మాత్రమే 195 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన మొదటివాడు మాత్రం కోహ్లీనే కావడం గమనార్హం.