హుజూరాబాద్ నియోజకవర్గానికి  మరో 200 కోట్లు విడుదల

హుజూరాబాద్ నియోజకవర్గానికి  మరో 200 కోట్లు విడుదల

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంపై ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. అడిగని వారిదే పాపం అన్నట్లు నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఏదో ఒక లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎక్కడెక్కడి నిధులన్నీ తెచ్చి హుజూరాబాద్ లో వరదలా పారిస్తోంది. తనకు దూరమైన దళిత వర్గాల వారిని అక్కున చేర్చుకునేందుకు దళితబంధు పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ పైలట్ ప్రాజెక్టుగా తొలుత హుజూరాబాద్ ని ఎంపిక చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. దళిత బంధు ప్రారంభం రోజున కేవలం 15 , 20 మందికే దళితబంధు సహాయం అందించడంపై ప్రతిపక్షాలు, దళితులు సైతం ఒకింత అసంతృప్తి, అనుమానం వ్యక్తం చేయడంపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తాజాగా మంగళవారం మరో 200 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో కలిపి హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల మొత్తం రూ.200 కోట్లకు చేరుకుంది.