బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో లైంగిక ‘దాడి’.. బాలికను వేధించిన దుండగులు

బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో లైంగిక ‘దాడి’.. బాలికను వేధించిన దుండగులు

సమస్తిపూర్: బిహార్‌‌‌‌‌‌‌‌లో బాలికలపై అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జముయిలో జరిగిన ఘటన మరువక ముందే, సమస్తిపూర్ జిల్లాలో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై ఫొటోలు దిగుతుండగా ఓ బాలికపై కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించిన తీరు కలకలం రేపింది. సమస్తిపూర్‌‌‌‌‌‌‌‌ జిల్లా జగత్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌పూర్ గ్రామంలో రోడ్డుపై వెళ్తున్న ఓ బాలుడు, బాలిక ఫొటోల కోసం ఆగారు. బైక్‌‌‌‌‌‌‌‌పై వచ్చిన కొందరు స్థానిక యువకులు వారిని చుట్టుముట్టారు. బాలికతో దురుసుగా ప్రవర్తించారు. రోడ్డుపైకి నెట్టేసి వేధించారు. దీనికి సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్ట్ చేశారు. 

గుణపాఠాలు నేర్చుకోకుంటే జైలుకెళ్లాలి

ఈ దారుణ ఘటనపై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జేడీయూ నేత రాజీవ్ రంజన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘‘ఇటువంటి నేరాలకు పాల్పడేవారు జముయి ఘటనలో తీసుకున్న కఠిన చర్యల గురించి గుణపాఠాలు నేర్చుకోవాలి.  లేదంటే నేరస్తులందరూ జైలు కెళ్లాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం బిహార్‌‌‌‌‌‌‌‌లోని జముయిలో కోచింగ్ క్లాస్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి వస్తున్న బాలికపై కొందరు దుండగులు వేధించిన వీఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.