ఉజ్వల సిలిండర్లపై మరో రూ.100 సబ్సిడీ

ఉజ్వల సిలిండర్లపై మరో రూ.100 సబ్సిడీ
  • దేశవ్యాప్తంగా మొత్తం 9.6 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం

న్యూఢిల్లీ: ఉజ్వల గ్యాస్‌‌ కనెక్షన్లు తీసుకున్న వారికి ఇస్తున్న సబ్సిడీని కేంద్రం రూ.300కు పెంచింది. ఈమేరకు బుధవారం కేంద్ర కేబినెట్‌‌ ఆమోదం తెలిపింది. 14.2 కేజీల సిలిండర్‌‌‌‌కు ప్రస్తుతం రూ.200 సబ్సిడీ ఇస్తుండగా, దానిని రూ.300కు పెంచుతున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్‌‌ ఠాకూర్‌‌‌‌ మీడియాకు తెలిపారు. దీని ద్వారా ఉజ్వల యోజన కింద ఉన్న 9.6 కోట్ల కుటుంబాలకు లబ్ది కలగనుందని వెల్లడించారు. 

గత ఆగస్టులో ప్రభుత్వం గ్యాస్ ధర రూ.200 తగ్గించగా ఉజ్వల లబ్ధిదారులు రూ.703 లకే సిలిండర్ అందుకున్నారు. ప్రస్తుతం సబ్సిడీని రూ.300లకు పెంచడంతో సిలిండర్  రూ.603లకే రానుంది. సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌‌ అకౌంట్‌‌లో జమ అవుతుంది.