ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరో ట్విస్ట్.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే లంచం తీసుకున్నారు..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరో ట్విస్ట్.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే లంచం తీసుకున్నారు..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. దర్యాప్తు చేస్తున్న అధికారులే లంచం తీసుకున్నట్లు గుర్తించారు సీబీఐ అధికారులు. నిందితుల జాబితాలో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీ సహా మరో ఆరుగురు అధికారులను అరెస్ట్ చేశారు.  వీరితోపాటు క్లారిడ్జెస్ హోటల్ సీఈవో విక్రమాదిత్య, ఎయిరిండియా ఉద్యోగి దీపక్‌ సంగ్వాన్‌ ఉన్నట్లు గుర్తించారు. లిక్కర్ పాలసీ కేసులో నిందితుడు అమన్ దీప్ సింగ్ నుంచి రూ. 5 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పవన్ ఖత్రీపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల్లో ఒకరి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ , మరో ఆరుగురు అధికారులు లంచం తీసుకున్నట్లు గుర్తించిన సీబీఐ..  సోమవారం వారిని అరెస్ట్ చేసింది.  ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. నిందితులు ED అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రి, అప్పర్ డివిజన్ క్లర్క్ నితేష్ కోహర్, ఎయిర్ ఇండియా ఉద్యోగి దీపక్ సంగ్వాన్, అమన్‌దీప్ సింగ్ ధాల్, బీరేందర్ పాల్ సింగ్,  చార్టర్డ్ అకౌంటెంట్ ప్రవీణ్ కుమార్, Claridges Hotels and Resorts CEO విక్రమాదిత్య లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.