బండి భగీరథ్ కేస్లో మరో ట్విస్ట్.. కొత్తగా మరో సెక్షన్.. నేరం రుజువైతే 10 ఏండ్లు జైలు లేదా జీవిత ఖైదు..?

బండి భగీరథ్  కేస్లో మరో ట్విస్ట్.. కొత్తగా మరో సెక్షన్.. నేరం రుజువైతే 10 ఏండ్లు  జైలు లేదా జీవిత ఖైదు..?

బండి భగీరథ్ కేసులో కొత్తగా మరో సెక్షన్ ను జోడించారు పోలీసులు. ఒకే బాధితురాలి పై పలుమార్లు అత్యాచారం చేసిన సెక్షన్ ఇప్పటి వరకు ఉన్న సెక్షన్లకు జతచేశారు. అందులో భాగంగా BNS 64(2)(m) సెక్షన్ ను  జోడించారు. ఈ నేరం రుజువైతే కనీసం  10 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదీ పడే అవకాశం ఉంది. ఇప్పటికే బండి భగీరధ్ పై  BNS 64(2)(m), BNS 74,75, Pocso సెక్షన్ 5(1) r/w 6 సెక్షన్  లు నమోదైన విషయం తెలిసిందే.

బాలికను లైంగికంగా వేధించారనే కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. 2026 మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. పోక్సో కేసులో ఎట్టకేలకు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్  పోలీసులకు లొంగిపోయాడు. అతని కుటుంబ సభ్యులు లాయర్ల సమక్షంలో మే 16న  పోలీసులకు  అప్పగించారు. 

పోలీసుల ముందు సరెండర్ అయిన బండి భగీరథ్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) మొబైల్‌ను  సీజ్ చేసి, తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ మొబైల్ ఫోన్ ద్వారా కేసులో కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలైన మైనర్ అమ్మాయితో బండి భగీరథ్ జరిపిన చాటింగ్స్, మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలతో పాటు సీసీటీవీ ఫుటేజ్లు ఏమైనా ఉన్నాయా? లేదా వాటిని డిలీట్ చేశారా? అనే కోణంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకోనున్నారు.

గత  ఏడాది కాలంగా ఆ మైనర్ అమ్మాయితో భగీరథ్ ఎలా వ్యవహరించేవాడు? ఎలాంటి సందేశాలు పంపించేవాడు? అనే పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. అంతేకాదు.. కేవలం ఆ మైనర్ అమ్మాయితోనే కాకుండా, ఇంకా ఇంకెంతమంది అమ్మాయిలతో బండి భగీరథ్ కాంటాక్ట్‌లో ఉన్నాడు? వారికి ఎలాంటి సందేశాలు పంపాడు? ఇంకెవరినైనా ఈ రకంగా లోబరుచుకున్నాడా? అనే సంచలన డేటాను కూడా పోలీసులు వెలికితీయబోతున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో మరో కొత్త కేసును జోడించడం గమనార్హం.