న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలంటూ ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలపై మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. బుధవారం జరిగిన నిరసనల సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం వంటి ఆరోపణలతో ఈ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అంకిత్ కసానా అనే కానిస్టేబుల్‌పై 35 మంది నిరసనకారులు దాడి చేశారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో తనను దుర్భాషలాడారని, యూనిఫామ్‌ను చింపేసి, దాడి చేశారని ఆ కానిస్టేబుల్ తెలిపారు.
