నోటిఫికేషన్లు లేక పురుగుల మందు తాగిన మరో నిరుద్యోగి

V6 Velugu Posted on Jun 11, 2021

రాష్ట్రంలో యువత ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఆత్మనూన్యత భావానికి లోనవుతున్నారు. ఇన్నేండ్లు కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు భారంగా ఉన్నామనే భావనతో చావలేక, బతకలేక ఆవేదన పడుతున్నారు. చదువు పూర్తయినా ఉద్యోగం రాక, అసలు నోటిఫికేషన్లే రాకపోవడంతో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగింది. సూర్యాపేట జిల్లా, నెరెడుచర్ల మండలం, మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి.. ఉన్నత చదువులు పూర్తిచేశాడు. గత కొంతకాలం నుంచి నల్గొండలో ఫ్రెండ్స్‌తో కలిసి రూం అద్దెకు తీసుకొని ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు. కానీ, గత కొంతకాలం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవీ రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు ఉపయోగం లేకుండా పోయాననే బాధతో పురుగుల మందు తాగాడు. గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tagged job notifications, Telangana, NALGONDA, unemployment, suicide, suryapet, neelkantam sai

Latest Videos

Subscribe Now

More News