డిగ్రీ విద్యార్థులకు మరో ఏడాది సాఫ్ట్​వేర్​ శిక్షణ

డిగ్రీ విద్యార్థులకు మరో ఏడాది సాఫ్ట్​వేర్​ శిక్షణ

హైదరాబాద్, వెలుగు: ఐఐటీ బాంబే స్పోకెన్​ట్యుటోరియల్ ప్రాజెక్ట్​లో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఐటీ, వివిధ సాఫ్ట్​వేర్​లపై  శిక్షణనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని మరో ఏడాది పొడిగించింది. ప్రాజెక్ట్ లో భాగంగా3  ఏండ్ల పాటు 50 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని 50 వేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణను ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని మరో ఏడాది పొడిగించింది.

ఈ మేరకు శనివారం ఐఐటీ బాంబే స్పోకెన్​ ట్యుటోరియల్​ ప్రాజెక్ట్​ ప్రతినిధులతో కాలేజ్​ ఎడ్యుకేషన్​ కమిషనర్​ బుర్రా వెంకటేశం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. నేషనల్​ మిషన్​ఆన్​ఎడ్యుకేషన్​ త్రూ ఐసీటీ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్​ ద్వారా  విద్యార్థులకూ లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.