IND vs ENG 2025: టీమిండియా ప్లేయింగ్ 11లో పదికి పది వికెట్లు తీసిన వీరుడు.. ఎవరీ అన్షుల్‌‌‌‌‌‌‌‌ కాంబోజ్‌‌‌‌‌‌‌‌..?

IND vs ENG 2025: టీమిండియా ప్లేయింగ్ 11లో పదికి పది వికెట్లు తీసిన వీరుడు.. ఎవరీ అన్షుల్‌‌‌‌‌‌‌‌ కాంబోజ్‌‌‌‌‌‌‌‌..?

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఇండియా టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మూడు మార్పులలో హర్యానా ఫాస్ట్ బౌలర్ అన్షుల్‌‌‌‌‌‌‌‌ కాంబోజ్‌‌‌‌‌‌‌‌ ఇండియా తుది జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. బుధవారం (జూలై 23) ఓల్డ్ ట్రాఫోర్డ్ లో మొదలైన ఈ టెస్టులో గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో కంబోజ్ కు స్థానం దక్కింది. దీంతో టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన 318 ప్లేయర్ నిలిచాడు. అసలు కంబోజ్ ఎవరో ఇప్పుడు చూద్దాం..    

ఎవరీ అన్షుల్‌‌‌‌‌‌‌‌ కాంబోజ్‌‌‌‌‌‌‌‌..? 

అన్షుల్‌‌‌‌‌‌‌‌ కాంబోజ్‌‌‌‌‌‌‌‌ హర్యానా ఫాస్ట్ బౌలర్. 2022 ఫిబ్రవరి 17న త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.ఈ మ్యాచ్ లో 29 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే 9వ నంబర్ లో బ్యాటింగ్ కు దిగి 28 బంతుల్లో మూడు సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. ఆ తర్వాత పంజాబ్ తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కాంబోజ్ మొదటి బంతికే ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను గోల్డెన్ డక్‌గా ఔట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 

గత మూడు సంవత్సరాలలో కాంబోజ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మొత్తం 24 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌తోనూ సత్తా చాటి 486 పరుగులు చేశాడు. అతని కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు 51 నాటౌట్. 2024 దులీప్ ట్రోఫీ ఎడిషన్‌లో, కాంబోజ్ ఇండియా సి తరపున మూడు మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

►ALSO READ | Shpageeza Cricket League: ఇంతకన్నా బెస్ట్ మూమెంట్ ఉంటుందా: తండ్రి బౌలింగ్‌లో తొలి బంతికే కొడుకు సిక్సర్

2024 రంజీ సీజన్ లో కాంబోజ్‌‌‌‌‌‌‌‌ (30.1–9–49–10) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఒకే ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 10 వికెట్లు తీసి సంచలనంగా మారాడు. దీంతో రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌‌‌‌‌‌‌‌గా చరిత్ర సృష్టించాడు.  ప్రేమాంగ్షు చటర్జీ, ప్రదీప్‌‌‌‌‌‌‌‌ సుందరమ్‌‌‌‌‌‌‌‌ ముందున్నారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో పది వికెట్ల హాల్‌‌‌‌‌‌‌‌ సాధించిన ఆరో ఇండియన్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌గా అన్షుల్‌‌‌‌‌‌‌‌ నిలిచాడు.  

కాంబోజ్‌‌‌‌‌‌‌‌ తన బౌలింగ్ ప్రదర్శనతో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2025 సీజన్ ఆడాడు. గత సంవత్సరం జరిగిన మెగా వేలంలో ఈ హర్యానా బౌలర్ ను రూ.3.40 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన ఈ యువ ఫాస్ట్ బౌలర్.. ఆ తర్వాత 2025 జూన్ 6 నుండి 9 వరకు నార్తాంప్టన్‌లో ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఏ తరపున ఆడి రెండు ఇన్నింగ్స్ ల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లోనూ రాణించి అజేయంగా 51 పరుగులు చేశాడు.