ఇదేం కాలమో ఏమో గానీ రోజుకో కొత్త రోగం తెరమీదకు వస్తోంది. ఇప్పుడు జపాన్ లో ఓ మహిళకు వచ్చిన జబ్బు గురించి తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మీకు నాలుక మీద ఉండే మచ్చల గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈమె నాలుక మొత్తం బ్లాక్ గా మారిపోయి, వెంట్రుకలు పెరిగాయి. . ఏంటీ అదేం రోగం అని షాక్ అవుతున్నారా అయితే మీకు ఈ విషయం గురించి పూర్తిగా చెబుతాం వినండి.
మనకు ఏదైనా అస్వస్థత అనిపించగానే వెంటనే దగ్గర్లోని మెడికల్ షాపునకు వెళ్లి యాంటి బయాటిక్స్ తెచ్చుకుంటాం. ఇలా చేసిన జపనీస్ మహిళ కష్టాలను కొని తెచ్చుకుంది. యాంటీబయాటిక్స్ ఎక్కువుగా వాడిన 60 ఏళ్ల మహిళ నాలుకపై వెంట్రుకలు వచ్చి నల్లగా మారి..ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లగా వింత జబ్బు సోకిందని వైద్యులు తేల్చారు. పూర్తి స్థాయిలో అన్ని టెస్టులు చేసి లింగువా విల్లోసా నిగ్రా (బ్లాక్ హెయిర్ టంగ్-BHT) వ్యాధి సోకినట్టు తేల్చారు.
యాంటిబయాటిక్స్ ఎక్కువ వాడితే...
బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లోని పబ్లిక్ కేసు నివేదిక ప్రకారం... ఈ మహిళ క్యాన్సర్‌తో బాధపడుతోంది. దీని చికిత్స దాదాపు 14 నెలల క్రితం ప్రారంభమై... కీమోథెరపీ జరుగుతోంది. ఈ క్రమంలో వైద్యులు ఆ స్త్రీకి మినోసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ ఇచ్చారు. కానీ ఈ మందు వల్ల మహిళ ముఖంపై నల్లటి మచ్చలు .. నాలుకపై జుట్టు వచ్చి నల్లబడిందని వైద్యులు తెలిపారు. యాంటి బయాటిక్స్ వల్ల ఆరోగ్యం కంటే దుష్ప్రభావాలు చాలా ఎక్కువుగా ఉంటాయి .
ప్రాణాంతకం కాదు
యాంటీబయాటిక్స్‌తో ఈ సమస్య చాలా అరుదుగా వస్తుందని వైద్యులు తెలిపారు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని..కాని ముఖంపై మచ్చలు కనపడతాయి. అప్పుడు డాక్టర్లను సంప్రదిస్తే మందులు మారుస్తారు. ఈ మహిళకు మందుదు మందులు మార్చడంతో 6 వారాల తర్వాత ముఖంపై మచ్చలు తగ్గాయి. అయితే నాలుక పొడిబారే సమస్య ఉన్న వారిలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని, జుట్టు పెరుగుతుందని చెప్పారు డాక్టర్లు. కాగా ఈ వ్యాధి నోటిని క్లీన్ గా ఉంచకోకపోవడం వల్ల, అలాగే నాలుకను శుభ్రం చేసుకోకపోవడం, అలాగే కాఫీ, టీ లాంటివి ఎక్కువగా తీసుకున్నా కూడా ఈ అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు డాక్టర్లు.