ప్రతి నలుగురులో ఒక్కరికి యాంటీబాడీస్ వృద్ధి

ప్రతి నలుగురులో ఒక్కరికి యాంటీబాడీస్ వృద్ధి

హైదరాబాద్: ప్రతి నలుగురులో ఒక్కరికి యాంటీబాడీస్ వృద్ధి చెందాయని ఎన్ఐఎన్, ఐసీఎంఆర్  సీరం సర్వే నివేదిక ప్రకటించింది. తెలంగాణలో జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో 3వ సారి ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సీరం గత డిసెంబర్ లో సర్వే నిర్వహించింది. మొత్తం 24 శాతం యాంటీబాడీస్ వృద్ధి చెందినట్టు ప్రకటించింది.

మొదటి సర్వే గత ఏడాది మే నెలలో జరగగా 0.33శాతం నమోదు అయ్యిందని చెప్పింది. ఆగస్ట్ లో 12.5 శాతం నమోదు కాగా డిసెంబర్ లో 24శాతం యాంటీబాడీస్ నమోదు అయినట్టు ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆగస్ట్ డిసెంబర్ నెలల మధ్యలో 3రేట్లు యాంటీబాడీస్ వృద్ధి చెందగా తెలంగాణలో 2 రేట్లు వృద్ధి చెందాయని తెలిపింది ఐసీఎంఆర్, ఎన్ఐఎన్.