మెహుల్ చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వం రద్దు

మెహుల్ చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వం రద్దు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును సుమారు 14వేల కోట్ల రూపాయిలు మోసగించి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీకి ఆంటిగ్వా ప్రభుత్వం షాకిచ్చింది. ఈడీ ప్రయత్నాలు ఫలించడంతో పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ఆంటిగ్వా ప్రకటించింది. చోక్సీ పౌరసత్వంపై విచారణ చేపట్టామని, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసి భారత్‌కు అప్పగించే ప్రక్రియ చేపడతామని ఆ దేశ ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ తెలిపారు. ఆర్థిక నేరాల్లో పాలుపంచుకున్న నేరగాళ్లకు అంటిగ్వాను సురక్షిత ప్రదేశంగా మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇన్నాళ్లు ఆనారోగ్య కారణాలు సాకుగా చూపి భారత్ కు వెళ్లకుండా ఉన్న చోక్సీ..ఇప్పుడు ఈడీ విచారణకు హాజరు కానున్నాడు.