ఎపిక్ కార్డుల పంపిణీలో ఆలస్యం చేయొద్దు: అనుదీప్

ఎపిక్ కార్డుల పంపిణీలో ఆలస్యం చేయొద్దు: అనుదీప్

హైదరాబాద్, వెలుగు: ఓటర్ ఎపిక్ కార్డులను ఎలాంటి ఆలస్యం చేయకుండా పంపిణీ చేయాలని హైదరాబాద్ జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి,  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.   తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ సోమవారం  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు.  

వాటికి అనుగుణంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఎలక్ట్రోరల్, రిజిస్ట్రేషన్ అధికారులతో తన ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  అభ్యర్థనలు, అభ్యంతరాల పరిష్కారాలు, బీఎల్వోల ద్వారా ఫామ్ 12డీ పంపిణీ,  స్టిక్కర్స్, పాంప్లెట్స్ పంపిణీ పురోగతి, ఓటర్ల ఫోన్ నంబర్ సేకరణ, ఓటర్ జాబితాలో వీఐపీల గుర్తింపు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.  సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ పనులను తొందరగా పూర్తి చేయాలని ఈఆర్వోలను ఆదేశించారు.  ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.