
కొందరు ఖర్చు గురించి మనం చాలా ఆలోచిస్తుంటారు.. ఖర్చులు ఎంత చేయాలి.. ఎలా చేయాలి.. బడ్జెట్ కు తగ్గట్టుగా ఎలా ఖర్చు చేయాలి.. ఇలా ఖర్చుల నిర్వహణకు తల బద్దలు కొట్టుకుంటుంటారు.. అయితే ఈ మధ్య కాలంలో ఖర్చుల నిర్వహణకు కృత్రిమ మేధస్సు (AI) వినియోగం భాగా పెరిగింది.. భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. ఇది ఇప్పటికే అనేకరికి దైనందిన ఆర్థిక జీవితంలో భాగంగా మారింది. AI ఆధారంగా పనిచేసే బడ్జెట్ యాప్స్, ఖర్చు ట్రాకర్లు, పెట్టుబడి సలహాదారులు మొదలైనవి సులభంగా లభ్యం అవుతున్నాయి. అయితే చాలా మందిలో డౌట్ ఉంది.. ఖర్చుల మెయింటెనెన్స్ కు AI ని సలహాలిచ్చే స్మార్ట్ అసిస్టెంట్ గా ఉపయోగించాలా? అని..
AI నిజానికి ఏమి చేస్తుంది?
AI- ఆధారిత బడ్జెట్ యాప్ లు మీ అన్ని ఆన్‌లైన్ లావాదేవీలను పరిశీలిస్తాయి. గత నెలలో మీరు ఎంత ఖర్చు చేశారో చెప్పడానికి బదులుగా మీరు ఎప్పుడు, ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తారో అవి గుర్తిస్తాయి. AI సెకన్లలో భారీ మొత్తంలో లావాదేవీలను స్కాన్ చేయగలవు ,మనం పట్టించుకోని ట్రెండ్‌లను గుర్తించగలవు. ఖర్చు విధానాలు ,ఖర్చులను తగ్గించగల ప్రాంతాలను గుర్తిస్తుంది. ఇది మనం జీవన శైలి ఆధారంగా మన ఆర్థిక సంబంధ విషయాలను చెప్పగలవు. యూజర్లు వారి పొదుపు లేదా పెట్టుబడి లక్ష్యాలను వేగంగా సాధించడంలో ఇది సహాయపడుతుంది.
అయితే AI పరిపూర్ణమైనది కాదు. నగదు కొనుగోళ్లు, తప్పుగా లేబుల్ చేయబడిన లావాదేవీలు వ్యవస్థను గందరగోళానికి గురి చేస్తాయి. చెక్ చేసుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎకనామికల్ డేటా చాలా సున్నితమైనది.అందుకే వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. ప్రసిద్ధ AI సాధనాలు గోప్యతా ప్రమాణాలు ,RBI లేదా జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR) వంటి నియంత్రణ చట్రాల క్రింద పనిచేస్తాయి. యూజర్లు స్పష్టమైన ప్రైవసీ సిస్టమ్ తో బ్యాంక్-గ్రేడ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించే సేవలను మాత్రమే ఎంచుకోవాలని హెచ్చరిస్తున్నారు.
AI పైలట్‌గా కాకుండా కో-పైలట్‌గా వ్యవహరించాలని చెబుతున్నారు. మీ స్వంత నిర్ణయంతో ఉపయోగించినప్పుడు AI ఉత్తమంగా పనిచేస్తుంది. ఇది మీకు మార్గనిర్దేశం చేయగలదు. ఏవైనా ఖర్చులను మర్చిపోయినట్లయితే గుర్తు చేస్తాయి కానీ మీ నిజమైన లక్ష్యాలు, మీ కుటుంబ ప్రణాళికలు లేదా మీ రిస్క్ ఏమిటో మీకు మాత్రమే తెలుసు. మీ కోసం నిర్ణయాలు తీసుకునే సాధనంగా కాకుండా మీ నిర్ణయం తీసుకోవడాన్ని సమర్ధించే స్మార్ట్ సాధనంగా AI ని వినియోగించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
సరళంగా చెప్పాలంటే త్వరిత గతిన ఆర్థిక సపోర్టు ఇవ్వడంలో AI అద్భుతంగా ఉంటుంది. తమ ఖర్చులను బాగా అర్థం చేసుకోవడానికి ,నియంత్రించాలనుకునే వ్యక్తులకు ఇది బెస్ట్ సపోర్టర్.AI ,మానవ అవగాహన కలిసి పనిచేసినప్పుడు బలమైన ఆర్థిక వృద్ధిని పొందే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.