
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కొండలరావుతో పాటు మరో 11 మందిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను కూకట్పల్లి పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. కాగా, ఆదివారం (ఆగస్ట్ 17) కూకట్‌పల్లిలోని ఓ గెస్ట్ హౌస్‌లో కొందరు పేకాట ఆడుతున్నట్లు ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గెస్ట్ హౌస్‌పై రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. గెస్ట్ హౌస్‌లో రెండున్నర లక్షల నగదుతో పాటు 11 మంది మొబైల్ ఫోన్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ 11 మందిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రితో పాటు ఓ డివిజన్ కార్పొరేటర్ కూడా ఉన్నట్లు సమాచారం. అనంతరం నిందితులను కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు ఎస్వోటీ పోలీసులు. కూకట్పల్లి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
►ALSO READ | అవినీతి ఆరోపణలు, అక్రమ వసూళ్లు.. మంచిర్యాలలో ఎస్ఐ సస్పెండ్