అవినీతి ఆరోపణలు, అక్రమ వసూళ్లు.. మంచిర్యాలలో ఎస్ఐ సస్పెండ్

అవినీతి ఆరోపణలు, అక్రమ వసూళ్లు.. మంచిర్యాలలో ఎస్ఐ సస్పెండ్

పోలీసు శాఖలోనూ  అవినీతి, అక్రమ దందాలు ఎక్కువుతున్నాయి.  పోలీసు స్టేషన్లలో సీఐలు, ఎస్సైలు సివిల్​ వ్యవహారాల్లో తలదూర్చి అవినీతికి పాల్పడుతున్నారు.  అంతే కాకుండా ఏదైనా కంప్లయింట్​తీసుకుంటే.. దాంట్లో ప్రోగ్రెస్​ జరగాలన్నా, యాక్షన్​ తీసుకోవాలన్నా, ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలన్నా లంచాలు డిమాండ్​ చేస్తున్నారు.  కొన్నిచోట్ల  పోలీసులే సెటిల్మెంట్లు చేస్తున్నట్టు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు

లేటెస్ట్ గా మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పని చేస్తున్న సురేష్ ను   సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.  అవినీతి ఆరోపణలు, అక్రమ వసూళ్లు.. భార్యాభర్తల మధ్య కుటుంబ పంచాయితీ నేపథ్యంలో కౌన్సిలింగ్ పేరిట ఓ వ్యక్తిని చితకబాదాడు ఎస్ఐ. ఈ విషయంపై  బాధితుడు  పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదించగా విచారణ చేసి ఎస్ఐ సురేష్ ను  సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 ఓ మహిళా కానిస్టేబుల్ ను వేధిస్తున్నారనే ఆరోపణలతో నిన్న  సూర్యాపేట జిల్లా  నూతనకల్ పాత ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ను  మరోసారి సస్పెండ్ చేశారు అధికారులు. 

►ALSO READ | రాజగోపాల్ రెడ్డి ఇష్యూ గురించి వచ్చే వారం చర్చిస్తాం: మల్లు రవి