ఆడుకుంటూ బిల్డింగ్ పై నుంచి కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి

ఆడుకుంటూ బిల్డింగ్ పై నుంచి కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో విషాదం నెలకొంది. ఆగస్టు 17న ఆడుకుంటూ ఐదేళ్ల బాలుడు బిల్డింగ్ పై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం అయిన బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  వనపర్తి జిల్లా బలజపల్లి గ్రామానికి చెందిన మింగ గురుమూర్తి, నందిని తమ ముగ్గురు పిల్లలతో రెండు నెలల క్రితం పటేల్ గూడలోని  హరివిల్లు టౌన్ షిప్ లో ఇల్లు అద్దెకు తీసుకు‌ని ఉంటున్నారు. గురుమూర్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే తన ఐదేళ్ల పెద్ద కొడుకు హర్షవర్దన్ తండ్రికి బై.. చెప్పి బిల్డింగ్ పైకి ఎక్కి సెకండ్ ఫ్లోర్ లో  రెయిలింగ్ పట్టుకుని ఆడుకుంటుండగా  కాలు జారి కింద పడి పోయాడు.  గేటు మీద పడడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా..అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. సంఘటన స్థలానికి  వచ్చిన అమీన్ పూర్  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న బాలుడు అప్పటి వరకు ఆడుకుంటున్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

►ALSO READ | అవినీతి ఆరోపణలు, అక్రమ వసూళ్లు.. మంచిర్యాలలో ఎస్ఐ సస్పెండ్