FUNKY: లిరిక్ రైటర్ అవతారమెత్తిన క్రేజీ డైరెక్టర్ అనుదీప్‌‌‌‌.. 10 లక్షలకి పైగా వ్యూస్తో దుమ్మురేపుతున్న ‘ధీరే ధీరే’

FUNKY: లిరిక్ రైటర్ అవతారమెత్తిన క్రేజీ డైరెక్టర్ అనుదీప్‌‌‌‌.. 10 లక్షలకి పైగా వ్యూస్తో దుమ్మురేపుతున్న ‘ధీరే ధీరే’

విశ్వక్ సేన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఇప్పటికే టీజర్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్‌‌‌‌.. బుధవారం ‘ధీరే ధీరే’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాట రిలీజైన 17 గంటల్లోనే 10 లక్షలకి పైగా వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

 భీమ్స్‌‌‌‌ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ  ‘ధీరే ధీరే మెలోడియస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ పాడారు. ‘‘గుప్పెడంత గుండెకెంత గుట్టు.. ఎందుకంట దానికంత బెట్టు.. నీకు నువ్వే చేరి చేయి పట్టేదాకా నే వేచి ఉంటానులే.. ధీరే ధీరే తూ.. దిల్‌‌‌‌లో ఆగయి.. మేరా దిల్లే లేగయి..’ అంటూ చిత్ర దర్శకుడు కేవీ అనుదీప్‌‌‌‌ రాసిన సాహిత్యం ఆకట్టుకుంది.

పాటలో విశ్వక్ సేన్, కయాదు లోహర్ ఆన్‌‌‌‌స్క్రీన్‌‌‌‌ కెమిస్ట్రీ ఇంప్రెస్ చేసింది. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్స్‌‌‌‌కు వస్తోంది.