
Insurance Claims: ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనే మీమ్ చాలా సార్లు సోషల్ మీడియా మీమర్స్ వినియోగించే ట్యాగ్ లైన్. ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వింత హెల్త్ ఇన్సూరెన్స్ రూల్స్ పాలసీహోల్డర్లను మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే అనుపమ్ గుప్తా అనే వ్యక్తి తనకు ఎదురైన ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయగా దీనిని చదివిన వారంతా హవ్వా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయనకు జరిగింది చూస్తే పెద్ద సినిమాలో సీన్ మాదిరిగానే కనిపిస్తోంది.
వాస్తవానికి అనుపమ్ గుప్తా ఒక ఉద్యోగి. దీంతో ఫ్యామిలీ కోసం ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అయితే తన ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందటం కోసం చేసిన ప్రయత్నంలో ఎదుర్కొన్ని వింత అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఈ నెల 7న ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం తమ ఇంటిని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంటూ ఇద్దరు తనకు కాల్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారు తమ బిల్డింగ్ దగ్గర వచ్చారని, ఇన్సూరెన్స్ కంపెనీ సంప్రదించలేదన్నారు.
ఆ సమయంలో తనను గూగుల్ టైమ్ లైన్ డేటా అడిగారని గుప్తా వెల్లడించారు. దీనికి తోడు క్లెయిమ్ కి సంబంధించిన డాక్యుమెంట్లు అడగగా.. ఒరిజినల్స్ కంపెనీనికి అందించానని చెప్పాడు. అయితే తన వద్ద మరో కాపీ ఉండటం వల్ల సేఫ్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే వారు నిజంగానే ఆసుపత్రికి వెళ్లినట్లు, ట్రీట్మెంట్ తీసుకున్నట్లు రుజువు చేసుకునేందుకు గూగుల్ టైమ్ లైన్ వివరాలను అడిగారని చెప్పారు. దీనికి తోడు ఆసుపత్రిలో చెల్లింపులకు సంబంధించిన క్రెడిట్ కార్డు బిల్లును కూడా తీసుకున్నట్లు గుప్తా చెప్పారు.
Two private detective investigators came to my house to verify a health insurance claim that we made. I am now wondering if health insurance is even worth it. Here's my story.
— Anupam Gupta (@b50) April 9, 2025
దీని తర్వాత ప్రైవేట్ డిటెక్టివ్ గుప్తా ఇంటికి సంబంధించిన ఫొటోలు తీసుకున్నారు. అలాగే క్లెయిమ్ కి సంబంధించిన వివరాల గురించి మరో వ్యక్తితో కూడా మాట్లాడాల్సి వచ్చిందని గుప్తా పేర్కొన్నారు. అసలు క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం ఇలాంటి ప్రక్రియ ఉంటుందా లేక తనకు మాత్రమే అలా జరిగిందా అని అడగగా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇదే ఫాలో అవుతున్నాయని అక్కడికి వచ్చిన ప్రైవేటు వ్యక్తులు వెల్లడించారు. దీని తర్వాత వారు మెుబైల్ ఫోన్ డిక్లరేషన్ తీసుకున్నారని గుప్తా సోషల్ మీడియాలో వెల్లడించారు.
ALSO READ : Google Layoffs: వందల ఉద్యోగులకు గూగుల్ షాక్.. ఆండ్రాయిడ్, పిక్సెల్ టెక్కీల ఊస్టింగ్
భారతీయులు తప్పుడు క్లెయిమ్స్ పొందటం కోసం ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేస్తున్న ఘటనలు పెరగటం కంపెనీలు కూడా జాగ్రత్తగా ఉండేందుకు ఇలాంటి ప్రక్రియను ఫాలో అవుతున్నాయని గుప్తా తన పోస్టులో పేర్కొన్నారు. అయితే పరిస్థితులు ప్రస్తుతం ఇలా దిగజారటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారు అడిగినట్లు ఇంట్లోకి రానివ్వకపోతే తన క్లెయిమ్ నిరాకరించబడేదని, ఇది ఇన్సూరెన్స్ రంగంలో వ్యాపారం చేస్తున్న అన్ని కంపెనీలు ప్రస్తుతం సర్వసాధారణంగా ఇలాంటి ప్రక్రియను ఫాలో అవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే ప్రైవేట్ డిటెక్టివ్స్ రావాలంతే అనే స్థాయికి పరిస్థితులు ప్రస్తుతం దిగజారాయి.