Horror Movie: థియేటర్లలోకి (Sept 12న) అనుపమ హారర్ ఫిల్మ్.. భయపెట్టే మరో మాసూద అవుతుందా?

Horror Movie: థియేటర్లలోకి (Sept 12న) అనుపమ హారర్ ఫిల్మ్.. భయపెట్టే మరో మాసూద అవుతుందా?

హారర్ థ్రిల్లర్స్‌‌లో ‘కిష్కింధపురి’ డిఫరెంట్‌‌గా ఉంటుందని  నిర్మాత సాహు గారపాటి అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగల్లపాటి రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాహు గారపాటి చెప్పిన విశేషాలు. 

‘‘ఇప్పటివరకు చాలా హారర్ కథలు వచ్చాయి. అయితే ఈ కథ మాత్రం చాలా యూనిక్‌‌గా  ఉంటుంది. హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ ఈ రెండింటి బ్లెండ్‌‌తో  కొత్త కథ చెప్పాడు దర్శకుడు.  ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్ దాని చుట్టూ ఉండే హారర్ ఎలిమెంట్స్‌‌ని చాలా బాగా  ప్రజెంట్ చేశాడు. బెల్లంకొండ  సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు కమర్షియల్, మాస్ సినిమాలు తీశారు. ఫస్ట్ టైం హారర్ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన ప్రెజెన్స్ చాలా కొత్తగా ఉంటుంది.

కథ వినగానే అనుపమ ఓకే చెప్పారు. తన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్  కొంత ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్  ఉంటుంది. సెకండాఫ్ నుంచి సీరియస్ హారర్ ఫిల్మ్‌‌గా టర్న్ అవుతుంది. ఇందులోని  రేడియో స్టేషన్ కోసం  దాదాపు రెండు కోట్లతో సెట్ వేశాం. ఆ సెట్ వెయ్యడానికే నెల రోజుల సమయం పట్టింది. యానిమల్, పుష్ప సినిమాలకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ దీనికి మిక్సింగ్ చేస్తున్నారు. రన్ టైం కూడా చాలా క్రిస్ప్‌‌గా ఉంటుంది.  ఇందులో  షాక్ ఫ్యాక్టర్స్, భయపడే మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఆడియెన్స్ తప్పకుండా థ్రిల్ ఫీల్ అవుతారు’’.

‘కిష్కింధపురి’ కాన్సెప్ట్‌:

సెప్టెంబర్ 3న ‘కిష్కింధపురి’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన.. అంటూ ‘కిష్కిందపురి ప్రేతాత్మ’ను పరిచయం చేసిన తీరు భయపెట్టించేలా ఉంది. దానికితోడు మసక చీకటి, ఓ ఒంటరి అడవి, అందులో వింతగా నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి.. ఇవన్నీ సస్పెన్స్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. దెయ్యాలపై ఆత్రుత ఉన్నవాళ్లందరినీ ఓ దెయ్యాల భవంతికి (సువర్ణ మాయ) తీసుకెళ్లి, దాని వెనకున్న కథేంటి అని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఓ వాకింగ్ చేయిస్తారు.

ఈ ప్రయాణంలో అక్కడున్న వారందరూ తమకి దెయ్యం చూడాలంటూ ఆసక్తి కలిగిన వెంటనే..‘సువర్ణ మాయకు విచ్చేసినందుకు ధన్యవాదములు’ అనే డైలాగ్తో దెయ్యం ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ ఎంట్రీతో వారిలో భయం మొదలైంది. ఈ క్రమంలో వారు ఆ దెయ్యాల భవంతిలో ఎలాంటి అనుభవాలు ఫేస్ చేశారు? చివరకు ఏమైందనేది సినిమా కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది.

ఇక ట్రైలర్ చివర్లో అనుపమ దెయ్యంగా మారడం, ఆ దెయ్యాన్ని ఎదుర్కొనే శక్తివంతుడైన పాత్రలో బెల్లకొండ కనిపించడం క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటికీ రిలీజైన టీజర్, అండ్ గ్లింప్స్ సైతం వణుకుపుట్టించేలా ఉన్నాయి. ఈ క్రమంలో సినిమాపై మరిన్నీ  అంచనాలు పెరిగాయి. థియేటర్లో మరో మాసూద లాంటి మూవీ చూడాల్సిందే అని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు.