Anupama Parameswaran: సస్పెన్స్ థ్రిల్లర్‌గా అనుపమ పరమేశ్వరన్ ‘లాక్‌డౌన్’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!

Anupama Parameswaran: సస్పెన్స్ థ్రిల్లర్‌గా అనుపమ పరమేశ్వరన్ ‘లాక్‌డౌన్’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు వింటేనే ఆ ఉంగరాల జుట్టు, అల్లరి నవ్వు కళ్లముందు కదలాడుతాయి. 'ప్రేమమ్' సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న ఈ భామ, తెలుగులో 'అ ఆ', 'శతమానం భవతి' వంటి చిత్రాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గ్లామర్ పాత్రలే కాకుండా, 'కార్తికేయ-2', 'టిల్లు స్క్వేర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ప్రస్తుతం టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది.  లేటెస్ట్ ఈ బ్యూటీ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘లాక్‌డౌన్’ విడుదలకు సిద్ధమైంది.

ఎట్టకేలకు తీరిన ‘లాక్‌డౌన్’ కష్టాలు !

అనుపమ వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ఆమె నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘లాక్‌డౌన్’ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.అయితే, ఎట్టకేలకు ఈ నెల జనవరి 30న థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

సినిమా కథేంటి?

ఈ చిత్రంలో అనుపమ 'అనిత' అనే యువతిగా కనిపించనుంది. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే చిక్కుకుపోయిన ఒక ఒంటరి యువతి ఎదుర్కొన్న మానసిక ఆందోళనలు, భయానక పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది కేవలం ఒక సర్వైవల్ థ్రిల్లర్ మాత్రమే కాదు, భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ డ్రామా అని దర్శకుడు ఏఆర్ జీవా పేర్కొన్నారు. అనుపమతో పాటు ఈ చిత్రంలో సీనియర్ నటి నిరోషా, చార్లీ, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్ వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఎన్‌ఆర్‌ రఘునందన్, సిద్ధార్థ్‌ విపిన్‌ల సంగీతం ఈ థ్రిల్లర్‌కు అదనపు బలాన్ని ఇవ్వనుంది.

తమిళంలో 'బైసన్' సినిమాతో ఇప్పటికే సాలిడ్ హిట్ కొట్టిన అనుపమ, ఇప్పుడు 'లాక్‌డౌన్'తో మరో ప్రయోగాత్మక విజయానికి సిద్ధమైంది. ఒకవైపు గ్లామర్, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ కథలతో బ్యాలెన్స్ చేస్తూ అనుపమ తన కెరీర్‌ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటోంది.