అనురాగ్ క్షమాపణ చెప్పాలె: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

అనురాగ్ క్షమాపణ చెప్పాలె: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • కులగణనతోనే బడుగులకు న్యాయం
  • రాహుల్ పై వ్యక్తిగత వ్యాఖ్యలను ఖండిస్తున్నం
  • నిరుద్యోగ సమస్యపై పోరాడుతం
  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఢిల్లీ: అనురాగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాలని లోక్సభలో ఆందోళన చేసినట్టు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. ఇవాళ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ కుల గణన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలా అయితేనే రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉంది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ, అనురాగ్ ఠాకూర్ వ్యక్తిగత విమర్శలు చేశారు. మేం ఖండిస్తున్నం. నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమాధానంలో కూడా తప్పులు ఉన్నాయి. కేవలం 8 లక్షల ఉద్యోగాలే ఇచ్చామని నెల కింద చెప్పారు. ఇప్పుడు మాట మార్చారు. నిరుద్యోగ సమస్యపై పోరాడుతాం’ అని అన్నారు.