లింగాల, వెలుగు: అనూష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అండపల్లి జలంధర్ రెడ్డి, శంకర నేత్రాలయం చెన్నై ఆధ్వర్యంలో ఆదివారం లింగాల హైస్కూల్ ఆవరణలో ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ప్రారంభించారు. 101 మందికి పరీక్షలు నిర్వహించి, 10 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు.
క్యాంప్ ఇన్చార్జి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన జలంధర్ రెడ్డి అంధత్వ నివారణే లక్ష్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో శంకర నేత్రాలయం చెన్నై కంటి వైద్య నిపుణులతో కంటి చికిత్స శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.
