కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలు నిజమేనా..?

కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలు నిజమేనా..?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు తలెత్తాయా? ఇద్దరికీ అస్సలు పడడం లేదా? వరల్డ్ కప్ తర్వాత ఇది మరింత ఎక్కువైందా? అంటే నిజమేనంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం కోహ్లీని ఇన్‌ స్టాగ్రా మ్‌ లో అన్‌ ఫాలో చేసిన రోహిత్.. ఇప్పుడు కోహ్లీ వైఫ్ అనుష్క శర్మను కూడా అన్‌ ఫాల్ అయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న అనుమానం నెటిజన్లకు మరింత బలపడింది.

తనను అన్‌ ఫాలో చేయడంపై గుర్రుగా ఉన్న అనుష్క.. రోహిత్ శర్మ, అతడి భార్య రితికలను అన్‌ ఫాలో చేసింది. ఈ పరిణామాలను చాలా క్షుణ్ణంగా గమనిస్తున్న నెటిజన్లు.. కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. వరల్డ్ కప్ లో ఇద్దరూ చాలా బాగా ఆడినప్పటికీ సెమీస్‌ లో ఓటమి తర్వాత విభేదాలు మళ్లీ బయటపడ్డాయని కామెంట్స్ చేస్తున్నారు.

విండీస్ టూర్ విషయంలో కోహ్లీ మనసు మార్చుకోవడానికి కూడా కారణం రోహిత్ శర్మేనని అంటున్నారు. నిజానికి ఈ టూర్ కు దూరంగా ఉండి రెస్ట్ తీసుకోవాలని కోహ్లీ భావించాడు. అయితే, అనుకోకుండా తన నిర్ణయాన్ని మార్చుకుని విండీస్ టూర్ కు వెళ్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఈ టూర్ కు తాను దూరంగా ఉంటే కెప్టెన్సీని రోహిత్‌ కు ఎక్కడ అప్పగించేస్తారోనన్న భయమే కోహ్లీతో ఈ పనిచేయించిందని చెబుతున్నారు. అయితే, విభేదాల వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నా.. ఇటు కోహ్లీ కానీ, అటు రోహిత్ కానీ ఇప్పటి వరకు స్పందించడంలేదు. దీనిపై BCCI కూడా ఎలాంటి ఏమీ తెలియనట్లే ఉంది.