ఏ పార్టీ వారైనా దేశం, ధర్మం కోసం పనిచేయాలి

ఏ పార్టీ వారైనా దేశం, ధర్మం కోసం పనిచేయాలి
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

జగిత్యాల జిల్లా:  ఏ పార్టీ కి చెందిన వారైనా హిందువులు..కాషాయ జెండా పట్టి హిందూ సమాజ శ్రేయస్సు కి , దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. భారతీయులుగా  హిందువుగా పుట్టడం మన పూర్వ జన్మ సుకృతం అని ఆయన పేర్కొన్నారు. కొందరు హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కథలాపూర్ మండలంలోని తండ్రియాల్ గ్రామంలో ఆయన శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ హిందూ సమాజ స్థాపన కు కృషి చేసిన మహనీయుడు శివాజీ అని, శివాజీ స్పూర్తితో  హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. 
విదేశాల్లో దేవుడు ఒక్కడే, అంటీ, అంకుల్ అని పిలుస్తుంటారు, కానీ మన దేశం లో దేవుళ్లు అనేకం, భారత దేశం సంస్కృతి  గొప్పదన్నారు. తెలంగాణ లో 80 శాతం మంది హిందువులున్నారు, ఎన్నికలప్పుడే నాయకులకు పార్టీలు ఉండాలి, అభివృద్ధి లో అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. హిందువులను, హిందూ సమాజాన్ని కించ పరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించడం అదృష్టం అని, కేంద్ర ప్రభుత్వ నిధులతో కథలాపూర్ మండలం అభివృద్ధి చేస్తానన్నారు.

తండ్రియాల్ నుంచి కోడిమ్యాల రోడ్డు ను తప్పకుండా కృషి చేస్తానని, వేములవాడ నాలుగు లైన్ల రోడ్డు కోసం  ప్రయత్నం చేస్తానన్నారు. అలాగే సర్కార్  స్కూల్ బిల్డింగ్ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీచర్ల బదిలీ జిఓ 317 పై ఈరోజు కరీంనగర్ లో  జాగరణ దీక్ష  చేస్తున్నానని బండి సంజయ్ వెల్లడించారు.