"అన్యా'స్ ట్యుటోరియల్" ఆహా'లో జులై 1నుంచి స్ట్రీమింగ్

"అన్యా'స్ ట్యుటోరియల్" ఆహా'లో జులై 1నుంచి స్ట్రీమింగ్

మెయిల్, లెవన్త్ అవర్, కుడి ఎడమైతే వంటి వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆహా ఒరిజనల్స్ లో ఇప్పుడు మరో సిరీస్ రాబోతుంది. అదే "అన్యాస్ ట్యుటోరియల్". వైవిధ్యమైన కథతో ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు వస్తోన్న ఈ సిరీల్ లో రెజీనా కసాండ్ర, నివేదా సతీష్, అగస్త్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ను పాన్ ఇండియా మూవీ బాహుబలి స్థాయిని పెంచిన సంస్థ ఆర్కా మీడియా బ్యానర్ లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను డార్లింగ్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ టీజర్ ఇంప్రెస్సింగ్ గా ఉందన్న ఆయన.. మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా అన్యాస్ ట్యుటోరియల్ అనే వెబ్ సిరీస్ ఆహా ఒరిజనల్ లో జులై 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.