
మహారాష్ట్ర పాలిటిక్స్ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయం క్రికెట్ లాంటిదేనన్నారు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చాన్నారు. ఒక్కోసారి మ్యాచ్ ఓడిపోతామనుకున్నా..చివరకు రిజల్ట్ వేరేలా ఉండొచ్చన్నారు. తాను ఢిల్లీ నుంచి ఇప్పుడే వచ్చానన్నారు. ఢిల్లీలో బిజీగా ఉండటం వల్ల మహారాష్ట్ర రాజకీయాల గురించి ఎక్కువగా తెలీదన్నారు. రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. కేంద్రం తప్పకుండా సాయం అందిస్తుందన్నారు.
బీజేపీకీ స్పష్టమైన మెజారిటీ రానందున మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. మూడు పార్టీలు ఉమ్మడి కార్యాచరణకు ఆమోదం తెలపడం, పదవులు పంపకాలపై కూడా ఓ స్పష్టతకు వచ్చినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
#WATCH "Anything can happen in cricket and politics. Sometimes you feel you are losing the match, but the result is exactly the opposite. Also, I have just arrived from Delhi, I don't know the detailed politics of Maharashtra,"Union Min Nitin Gadkari on Maharashtra govt formation pic.twitter.com/JB6cfeMRok
— ANI (@ANI) November 14, 2019