ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ ఆధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పీఆర్సీ సహా కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు జగనన్న టౌన్ షిప్ లో ఇళ్ల స్థలాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈబీసీ నేస్తం అమలుతోపాటు అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేల ఆర్థికంగా సహాయం అందించేందుకు ఆమోదం తెలిపింది.
