
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా ప్రహ్లాద్ జోషి అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖలు రాయడంతో జగన్ రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు.