కేసీఆర్‌ ఆరోగ్యంపై ఆరా.. కేటీఆర్‌కు సీఎం జగన్‌ ఫోన్..

కేసీఆర్‌ ఆరోగ్యంపై ఆరా.. కేటీఆర్‌కు సీఎం జగన్‌ ఫోన్..

హైదరాబాద్‌: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిసెంబర్ 8వ తేదీ గురువారం అర్ధరాత్రి పమాదవశాత్తు కాలు జారిపడటంతో.. చికిత్స కోసం శుక్రవారం ఉదయం ఆయనను హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు ఈరోజు సాయంత్రం వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలికడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ ను జగన్ పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్యంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.  ఆయన ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇదే విషయంపై ట్వీట్ చేశారు. 'కేసీఆర్‌ గారు గాయపడ్డారని తెలిసి చాలా బాధపడ్డాను.ఇవాళ ఆయనకు జరుగుతున్న సర్జరీ విజయవంతమై..త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కేసీఆర్‌కు గాయం కావడంపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో తెలిపారు.