
ఆంధ్రప్రదేశ్ లో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం కొలువుదీరబోతోంది. మొత్తం 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయబోతున్నారు వైఎస్ జగన్. 8 మంది బీసీ మంత్రులు, నలుగురు కాపు నాయకులు, నలుగురు రెడ్లు, ఒక ఎస్టీ, ఐదుగురు ఎస్సీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ , ఒక వైశ్య, ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు కేబినెట్ లో చోటుదక్కనుంది. కళింగ, బ్రాహ్మణ సామాజికవర్గ నాయకులకు స్పీకర్ పోస్టులు దక్కనుంది.
ఉత్తరాంధ్ర నుంచి.. మొదలుకొని ఒక్కొక్కరికి పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్లాయి. మొత్తం 13 జిల్లాల్లో సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, విధేయత ఆధారంగా కేబినెట్ బెర్తులు కేటాయించినట్టు చెబుతున్నారు.
జగన్ మంత్రి వర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్న మంత్రులు వీరే.
- బొత్స సత్యనారాయణ(బీసీ) – చీపురుపల్లి -విజయనగరం
- ధర్మాన కృష్ణ దాస్ -నరసన్న పేట – శ్రీకాకుళం జిల్లా
- పాముల పుష్ప శ్రీవాని(ఎస్టీ) – కురుపాం- విజయనగరం
- కురసాల కన్నబాబు(కాపు) – కాకినాడ రూరల్ – తూర్పుగోదావరి
- పినిపే విశ్వ రూప్(ఎస్సీ) – తూర్పుగోదావరి
- బాలినేని శ్రీనివాస్ రెడ్డి – ఒంగోలు, ప్రకాశం జిల్లా
- ఆళ్ల నాని(కాపు) – ఏలూరు- వెస్ట్ గోదావరి
- అవంతి శ్రీనివాస్(కాపు) – భీమిలి. విశాఖ జిల్లా
- తానేటి వనిత(ఎస్సీ) – కొవ్వూరు – పశ్చిమగోదావరి జిల్లా
- పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఎమ్మెల్సీ – తూర్పుగోదావరి
- చెరుకువాడ శ్రీరంగనాథ రాజు – ఆచంట- వెస్ట్ గోదావరి
- పేర్ని నాని – కృష్ణా, మచిలీపట్టణం
- కొడాలి నాని – గుడివాడ
- వెళ్ళంపల్లి శ్రీనివాస్ – విజయవాడ వెస్ట్- కృష్ణా జిల్లా
- మేకతోటి సుచరిత(ఎస్సీ) – ప్రత్తిపాడు – గుంటూరు జిల్లా
- మేకపాటి గౌతమ్ రెడ్డి – ఆత్మకూరు
- మోపిదేవి వెంకటరమణ
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పుంగనూరు
- ఆళ్ల రామకృష్ణారెడ్డి – మంగళగిరి
- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి- డోన్- కర్నూలు
- గుమ్మనూరు జయరాం – ఆలూరు
- శంకర్ నారాయణ -పెనుకొండ
- నారాయణ స్వామి – గంగాధర నెల్లూరు
- అనిల్ కుమార్ యాదవ్ – నెల్లూరు సిటీ
- అంజాద్ భాషా (మైనార్టీ)-కడప
స్పీకర్- తమ్మినేని సీతారం (కళింగ-బీసీ)
డిప్యూటీ స్పీకర్- కోన రఘుపతి (బ్రాహ్మణ)