ఏపీ అక్రమంగా 86 ప్రాజెక్టులు కడుతోంది

ఏపీ అక్రమంగా 86 ప్రాజెక్టులు కడుతోంది
  • కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ఇంజనీర్స్‌‌ ఫోరం కంప్లయింట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా 86 ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ ఇంజనీర్స్‌‌ ఫోరం కన్వీనర్‌‌ దొంతుల లక్ష్మీనారాయణ డిమాండ్‌‌ చేశారు. శనివారంజలసౌధలో ఇరిగేషన్‌‌ ఈఎన్సీ మురళీధర్‌‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, సీఎం కేసీఆర్‌‌కు, ఇరిగేషన్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ, కృష్ణా, గోదావరి బోర్డుల మెంబర్‌‌ సెక్రటరీలకు రిజిస్టర్డ్‌‌ పోస్టు ద్వారా కంప్లయింట్‌‌ చేశానని తెలిపారు. 1957లో పూర్తయిన ప్రకాశం బ్యారేజీకి సైతం ఇంతవరకు ఎలాంటి అనుమతులు లేవని, అయినా ఏపీ ప్రభుత్వం దాని కింద అక్రమంగా ఇంకో మూడు బ్యారేజీలు నిర్మించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. వీటికి అదనంగా రాష్ట్ర విభజన తర్వాత మరో 30 ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుందని తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ స్పందించి ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

గోదావరి బేసిన్‌‌లో ఏపీ చేపట్టిన ప్రాజెక్టులివీ

గోదావరి బేసిన్‌‌లో ఏపీ ప్రభుత్వం చెంగల్నాడు, చింతలపూడి లిఫ్టులు, గోదావరి–పెన్నా లింక్‌‌ ఫేజ్‌‌-1, పురుషోత్తమపట్నం, వెంకటనాగారం లిఫ్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అరికిరేవుల, పట్టిసీమ, పోగొండ రిజర్వాయర్‌‌, వేగేశ్వరపురం, కొవ్వాడ కాల్వ రిజర్వాయర్‌‌, విజయరాయి, తాండవ, మాదిగెడ్డ ప్రాజెక్టులు నిర్మిస్తోందని దొంతుల లక్ష్మీనారాయణ తెలిపారు. నాగావళి, వంశధార బేసిన్‌‌లలో తోటపల్లి మోడ్రనైజేషన్‌‌, తారకరామతీర్థ సాగరం రిజర్వాయర్‌‌, ఒట్టిగెడ్డ, పెద్దగెడ్డ, పెద్దంకలం, వంశధార–నాగావళి లింక్‌‌ ప్రాజెక్టులు నిర్మించిందని చెప్పారు.

కృష్ణా, పెన్నా బేసిన్‌‌లలో..

కృష్ణా, పెన్నా బేసిన్‌‌లలో కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదులపై ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమ ప్రాజెక్టులు నిర్మించిందని దొంతుల లక్ష్మీనారాయణ చెప్పారు. కొరిసపాడు లిఫ్ట్‌‌, మడకశిర బ్రాంచ్‌‌ కెనాల్‌‌, అడవిలపల్లి, గాలేరు–నగరి, హంద్రీనివా, జీడిపల్లి లిఫ్ట్‌‌, ప్రకాశం బ్యారేజీ, సోమశిల–స్వర్ణముఖి లింక్‌‌ కెనాల్‌‌, రామతీర్థం బ్యాలెన్సింగ్‌‌ రిజర్వాయర్‌‌, వైకుంఠపురం బ్యారేజీ, గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్‌‌ రిజర్వాయర్‌‌ లిఫ్ట్‌‌, మర్ల రిజర్వాయర్‌‌, అనుపు లిఫ్ట్‌‌, ఏమిలేరు పంపింగ్‌‌ స్కీం, ఎన్‌‌జీ పాడు లిఫ్ట్‌‌, అర్నేర్‌‌ ప్రాజెక్టు, గొల్లపూడి, గుడిమెట్ల -2, జూపాడు బంగ్లా-2, కోపర్రు, కొప్పునూరు లిఫ్టులు, కుప్పం బ్రాంచ్‌‌ కెనాల్‌‌, పులకుర్తి, పులికనుమ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌, త్యల్లూరు, వెలిగొండ, భైరవానితిప్ప, తారకరామ, కండలేరు, కృష్ణాపురం, యోగివేమన, పెన్నా అహోబిలం, గురురాఘవేంద్ర, రెమట, గుంటూరు కెనాల్‌‌, గుండ్రేవుల, ఆర్డీఎస్‌‌ – ఆర్‌‌ఎంసీ, తుంగభద్ర హైలెవల్‌‌ కెనాల్‌‌, గండిపాలెం, స్వర్ణముఖి, నెల్లూరు బ్యారేజీ, పెన్నా డెల్టా, సిద్ధాపురం, సోమశిల, మిడ్‌‌ పెన్నార్‌‌ రిజర్వాయర్‌‌, అప్పర్‌‌ సగిలేరు, తమ్మిలేరు, హీరమండలం, వంశధార రెండు స్టేజీలు, వేదవతి, అనంతపురంలోని కమ్యూనిటీ లిఫ్ట్‌‌ స్కీంలు చేపట్టిందన్నారు.

For More News..

హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న లీజ్ ఫార్మింగ్

రాష్ట్ర చరిత్రలో ఫస్ట్​ టైమ్.. ఒక్క నెలలోనే 850 కోట్ల ఇన్‌కం

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పెంచిన బోర్డు

కరోనాతో మరణించిన డాక్టర్‌‌‌‌ భార్యకు ఉద్యోగం