ఏపీలో ఇవాళ కొత్త కేసులు 12,926.. మరణాలు 8

V6 Velugu Posted on Jan 22, 2022

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ప్రతిరోజూ 12 వేలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతుండగా.. ఇవాళ అంటే గడచిన 24 గంటల్లో 12,962 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా సోకి ఆస్పత్రులలో చేరిన వారిలో 8 మంది కోలుకోలేక చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇవాళ కూడా12వేలకు పైబడిన కేసులు నమోదు కాగా.. అత్యధికంగా విశాఖపట్టణం జిల్లాలో 1959 కేసులు తర్వాత చిత్తూరు జిల్లాలో 1566 కేసులు, అనంతపురం జిల్లాలో 1379 కేసులు, గుంటూరులో 1212 చొప్పున నమోదయ్యాయి.

కరోనా వల్ల గడచిన 24 గంటల్లో విశాఖపట్టణంలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు చొప్పున చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం 73 వేల 143 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యశాఖ పేర్కొంది. జిల్లాల వారీగా నమోదైన కేసులు వివరాలు కింద పట్టికలో చూడండి...

ఇవి కూడా చదవండి

 

కేరళ సెంట్రల్ జైలులో 262 మంది ఖైదీలకు కరోనా

PRC GOలపై పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

ఆన్​లైన్​ అడిక్షన్.. పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్

Tagged AP, health, cases, corona, deaths, COVID19, Positive, register, bulletin

Latest Videos

Subscribe Now

More News