కేరళ సెంట్రల్ జైలులో 262 మంది ఖైదీలకు కరోనా

V6 Velugu Posted on Jan 22, 2022

తిరునంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా నిలుస్తోంది. నిన్న శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 41,వేల 686కేసులునమోదు కాగా వీటిలో 7876 కేసులు ఒక్క తిరువనంతపురం నగరంలోనే నమోదు అయ్యాయి.   ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల విజృంభణ అదేస్థాయిలో కొనసాగుతున్నట్లు కేసుల సంఖ్య సూచిస్తోంది.

తాజాగా పూజప్పుర సెంట్రల్ జైలులో 262 మంది ఖైదీలకు కరోనా నిర్ధారణ అయింది. అనుమానితులకు మూడు రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 262 మంది ఖైదీలకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ ప్రత్యేక సెల్ లలో ఉంచుతున్నారు. కరోనా సోకినవారికి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్యులను నియమించాలని జైలు అదికారులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. 

 

ఇవి కూడా చదవండి

PRC GOలపై పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

ఆన్​లైన్​ అడిక్షన్.. పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్

ఆస్కార్ రేసులో రెండు సౌతిండియన్ సినిమాలు

విశ్లేషణ: నేర చరితులను రాజకీయాల నుంచి వెలి వేయాలి

 

Tagged cases, kerala, corona, central jail, COVID19, Positive, register, Thiruvananthapuram, inmates

Latest Videos

Subscribe Now

More News