రైతులకు గుడ్ న్యూస్: అకౌంట్లలో డబ్బులు పడ్డాయి చెక్ చేసుకోండి..!

రైతులకు గుడ్ న్యూస్: అకౌంట్లలో డబ్బులు పడ్డాయి చెక్ చేసుకోండి..!

ఏపీ ప్రభుత్వం రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేసింది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. ఈ క్రమంలో రైతులకు సమయానికి సహాయం చేస్తున్నామని, ఏ పంట నష్టం జరిగినా పారదర్శకంగా పరిహారం ఇస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం అన్నిరకాలుగా రైతులకు అండగా ఉందని, రైతులు నష్టపోకూడదన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గతంలో రంగు మరీనా ధాన్యాన్ని ప్రభుత్వం కొనే పరిస్థితి ఉండేది కాదని, తమ ప్రభుత్వం వచ్చాక రంగుమారిన ధాన్యాన్ని కూడా కొన్నామని అన్నారు.

మిచాంగ్ తుఫాన్ సమయంలో 3.25లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. ఏపీలో 87శాతం మంది రైతులకు హెక్టారు లోపే భూమి ఉందని అన్నారు. సుమారు 12లక్షల మంది మిచాంగ్ తుఫాన్ బాధిత రైతులకు సాయం చేశామని అన్నారు. 1294కోట్ల రూపాయలు నేరుఆ రైతుల అకౌంట్లలో వేశామని అన్నారు.

ALSO READ :- బంపరాఫర్ : బాంబు పెట్టినోడిని పట్టిస్తే రూ.10 లక్షలు

 రాష్ట్రంలో అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని అన్నారు.ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్లోనే రైతులకు నష్ట పరిహారం ఇస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ అన్నారు.