నిరుద్యోగ యువతకు జగన్ సర్కారు కొత్త పథకం

నిరుద్యోగ యువతకు జగన్ సర్కారు కొత్త పథకం

అమ‌రావ‌తి: నిరుద్యోగ యువతకు జగన్ సర్కారు కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. ఉపాధి కల్పన చేయూతనిచ్చేందుకు ‘వైఎస్సార్ ఆదర్శం’ పేరుతో పథకానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. వివిధ కార్పొరేష‌న్ల ద్వారా 6000 వాహ‌నాలు కోనుగోలుకు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందించి నిరుద్యోగ యువతకు ఈ వాహనాలను అందజేయడం ద్వారా ఉపాధి చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అర్హుల ఎంపికకు కమిటీలు

ఎస్సీ, ఎస్టీ, కాపు, బిసీ, మైనారిటీ కార్పొరేష‌న్ల ద్వారా ఆయా వర్గాల యువతకు వాహనాలు అందజేయాలని మార్గదర్శకాలను జారీ చేసింది వైఎస్ జగన్ సర్కారు. ‘వైఎస్సార్ ఆదర్శం’ పథకానికి అర్హులను ఎంపిక చేసి, అక్రమాలు లేకుండా అమలు చేసేందుకు  రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు వేసింది ప్రభుత్వం.

సాంఘిక సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి నేతృత్వంలో 8 మంది స‌భ్యుల‌తో రాష్ట్ర స్థాయి క‌మిటీ ఏర్పాటు..

జిల్లాల్లో క‌లెక్ట‌ర్ల ఆద్వ‌ర్యంలో ఏడుగురు స‌భ్యుల‌తో క‌మిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అర్హుల ఎంపిక, రుణాలు మంజూరు వ్య‌వ‌హారాలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి.