హైదరాబాద్ కు వెళ్లొద్దుని ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

హైదరాబాద్ కు వెళ్లొద్దుని ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

కరోనా వైరస్ వ్యాప్తి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు ఎక్కడికీ వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని… అనవసరంగా ఎవరూ ఎక్కడకూ వెళ్లొద్దని తెలిపింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించింది. సరైన మెడికల్ సర్టిఫికెట్స్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కు అనుమతిస్తామని తెలిపింది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారు ఇంటి నుంచే పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు కరోనా టెస్టులకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెస్టులకు ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతించింది. ప్రభుత్వం పంపిన శాంపిల్స్ కు రూ. 2,400…. వ్యక్తిగతంగా ఎవరైనా టెస్ట్ చేయించుకుంటే రూ. 2,900 చెల్లించాని నిర్ణయించింది.