ఏపీలో సాయంత్రం 6 తర్వాత మందు అమ్ముడు బందు

ఏపీలో సాయంత్రం 6 తర్వాత మందు అమ్ముడు బందు

ఐదేళ్లలో విడతల వారీగా మద్యపాన నిషేధాన్ని విధించే దిశగా ఏపీలోని జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా.. మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం మద్యం అమ్మకాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ సమయాన్ని కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లిక్కర్ ను అమ్మాలని భావిస్తోంది. దీంతో 4 గంటలు మద్యం అమ్మకాలు తగ్గుతాయి. దీంతో, సాధారణ అమ్మకాలతో పోలిస్తే లిక్కర్ అమ్మకాలు భారీ స్థాయిలో తగ్గనున్నాయి.

వాస్తవానికి సాయంత్రం 6 గంటల తర్వాతే మద్యం అమ్మకాలు బాగా జరుగుతాయి. ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఎవరైనా సరే… రాత్రి వేళల్లోనే ఎక్కువగా మద్యం తాగుతారు. 6 గంటలకే మద్యం షాపులను బంద్ చేస్తే… మద్యం అమ్మకాలు భారీగా తగ్గుతాయని ప్రభుత్వం యోచిస్తోంది. లిక్కర్ అమ్మకాలపై తీసుకున్న నిర్ణయం అక్టోబరు నుంచి అమల్లోకి రానుంది.