ఆ మీడియా సంస్థ క్షమాపణలు చెప్పాలి : డీజీపీ శివధర్ రెడ్డి

ఆ మీడియా సంస్థ క్షమాపణలు చెప్పాలి : డీజీపీ శివధర్ రెడ్డి
  •     అసత్య ప్రచారాలను ఉపేక్షించేది లేదు: డీజీపీ శివధర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: మంత్రి, మహిళా ఐఏఎస్​ఆఫీసర్‌‌‌‌ను ఉద్దేశిస్తూ తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఐపీఎస్ ​ఆఫీసర్స్ అసోసియేషన్ ​ప్రెసిడెం ట్, డీజీపీ శివధర్ ​రెడ్డి, ఉపాధ్యక్షుడు విక్రమ్‌‌ సింగ్ మాన్ డిమాండ్​ చేశారు. 

అసత్య ప్రచారాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో ఐఏఎస్ అధికారుల సంఘానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నిరాధారమైన ఆరోపణలతో ప్రభుత్వ అధికారుల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నం. 

మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం హేయమైన చర్య. మహిళా అధికారులు చిత్తశుద్ధి, ధైర్యం, వృత్తి నైపుణ్యంతో సమాజం కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదు. ఇలాంటి చర్యలు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తాయి. సదరు మీడియా సంస్థ తమ తప్పును సరిదిద్దుకోవడంతో పాటు భేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌లలోని అభ్యంతరకర కంటెం ట్‌‌ను తొలగించాలి” అని డిమాండ్ చేశారు.