అజీజ్ నగర్ పోచమ్మ ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు..

అజీజ్ నగర్ పోచమ్మ ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు..

ఆదివారం ( జనవరి 11 ) అజీజ్ నగర్ లో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అజీజ్ నగర్ గ్రామంలో బోనాల పండుగ సందర్బంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దర్శించుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు. సతీసమేతంగా అజీజ్ నగర్ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి వివేక్. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. అజీజ్ నగర్ పోచమ్మ ఆలయానికి రావడం సంతోషంగా ఉందని.. బోనాల పండుగ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆలయ కమిటీకి కృతజ్ఞతలు అని అన్నారు మంత్రి వివేక్.

గతంలో కూడా చాలాసార్లు పోచమ్మ ఆలయాన్ని సందర్శించానని.. కానీ బోనాల సందర్భంగా రావడం తొలిసారి అని అన్నారు.ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని.. ఏర్పాట్లు బాగా చేశారని అన్నారు మంత్రి వివేక్.పోచమ్మ తల్లి ఆశీస్సులతో అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు మంత్రి వివేక్.