- ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్అధికారుల సంఘం
హైదరాబాద్, వెలుగు: ఓ టీవీ చానెల్‌లో ఇటీవల ప్రసారమైన కథనాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారుల సంఘం సభ్యులు తీవ్రంగా ఖం డించారు. మహిళా ఐఏఎస్ అధికారులపై ఆ చానెల్‌లో చేసిన వ్యాఖ్యలు సరికాదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ కథనం పూర్తిగా అసత్యమైనదని, ఆధారాలు లేనివని పేర్కొన్నారు.
పోస్టింగ్‌లు, విధి నిర్వహణ, వ్యక్తిగత అంశాలకు సంబంధించినట్టు చేసిన వ్యాఖ్యలు అధికారుల గౌరవ మర్యాదలు, వారి గోప్యత, వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. సంబంధిత మహిళా అధికారులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, వివాదాస్పద కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ సహచర అధికారులకు పూర్తి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు.
