
ఏపీలో త్వరలో 9700కి పైగా డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌వెూహన్‌రెడ్డి ఆదేశించారని అందుకు అనుగుణంగా కార్యాచరణ చేస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వస్తున్నందున అదనపు బెడ్లు సిద్ధం చేస్తున్నామన్నారు. హైరిస్క్ ప్రాంతాలైన మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వస్తున్న వారందరికీ పరీక్షలు చేస్తున్నట్టు జవహర్ పేర్కొన్నారు. కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, రేపటికి కరోనా టెస్టుల సంఖ్య 3 లక్షలు దాటుతుందని చెప్పారు.