
కరోనా వైరస్ భారీగా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా టెస్టులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ల్యాబ్స్‌లోనూ కరోనా టెస్టులు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పరీక్షలు చేయొచ్చని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL), భారత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ICMR) నుంచి ప్రైవేటు ల్యాబ్స్ ఆమోదం పొంది ఉండాలని పేర్కొంది. ఇందుకోసం ముందుగా తమ ల్యాబ్‌కు పరీక్షల నిర్వహణ సామర్థ్యం ఉందని, తమకు కరోనా టెస్టులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని.. వాటి యాజమాన్యాలు ప్రతిపాదనలు పంపాలని సూచించింది. వాటిని పరిశీలించి NABL, ICMR అనుమతి ఇస్తే ఆయా ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ప్రైవేటు ల్యాబ్స్‌లో పరీక్షలు చేయించుకునే వారి నుంచి రూ.2900 చార్జ్ చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.